పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: సీనియర్ జడ్జి
WNP: ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో తండ వాసులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సీనియర్ జడ్జి రజిని మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.