జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా పని చేస్తాం: JCHSL కార్యవర్గం

HYD: ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో “ది జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్" జనరల్ బాడీ సమావేశం సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండ భేరి గోపరాజు అధ్యక్షతన జరిగింది. గత నాలుగున్నరేళ్లుగా పర్సన్ ఇన్‌ఛార్జ్ ఆధీనంలో ఉన్న సొసైటీకి ఇటీవల కాలంలో ఎన్నికలు జరగడం, కొత్త కార్యవర్గం ఏర్పాటు కావడంతో 5 ఏళ్ల తర్వాత జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.