రాఖీ ఆకారాన్ని కట్టిన యడవల్లి విద్యార్థులు

రాఖీ ఆకారాన్ని కట్టిన యడవల్లి విద్యార్థులు

KMM: ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్న సోదరభావాన్ని చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో రాఖీ ఆకారంలో కూర్చుని పెద్ద రాఖీ రూపాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు ఎం. నాగలక్ష్మి, టి. మల్ల పర్యవేక్షించగా, ఉపాధ్యా యులు, గ్రామస్థులు ప్రశంసించారు.