ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: గంటా
AP: విశాఖలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మసీదులు, వక్ఫ్ బోర్డుకు సంబంధించి రూ.46 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం సోదరులకు అండగా ఉంటామని, అందరూ సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు.