భద్రకాళి అమ్మవారికి విశేషమైన అలంకారం
WGL: చారిత్రక భద్రకాళి దేవాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నూతన వస్త్రాలంకరణలో ధగధగలాడుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు నగరం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.