మధిర పోలీస్ స్టేషన్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మధిర పోలీస్ స్టేషన్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KMM: మధిరలోని రూరల్, టౌన్ పోలీస్ స్టేషన్లలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టౌన్ సీఐ రమేష్, రూరల్ సీఐ మధు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు అనేక పోరాటాలు చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.