సుహాస్ కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

విభిన్న కాన్సెప్ట్‌లతో అలరిస్తున్న నటుడు సుహాస్ తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. 'హే భగవాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. ఇక దర్శకుడు గోపి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శివాని నాగారం కథానాయికగా నటిస్తోంది.