పాఠశాలకు పూర్వ విద్యార్థి భారీ విరాళం

పాఠశాలకు పూర్వ విద్యార్థి భారీ విరాళం

JGL: కథలాపూర్ మండలంలోని తక్కళపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి అదునాల సాయబ్ రూ.2 లక్షల విలువైన విద్యా సామాగ్రిని బుధవారం అందజేశారు. ఇందులో 2 ఐఎఫ్పీ డిజిటల్ బోర్డులతో పాటు 10 కంప్యూటర్ కుర్చీలు ఉన్నాయి. పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు.