తణుకులో వైసీపీ కొవ్వొత్తులతో నిరసన
W.G: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆదివారం రాత్రి తణుకు పట్టణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ ఘటనకు ఎవరు కారణమని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.