నేడు జిల్లాలో PGRS కార్యక్రమం
KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని నేడు (సోమవారం) కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. అలాగే అన్ని మండల, డివిజినల్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు.