విద్యుత్ షాక్‌తో మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే
GDWL: ధరూర్ మండలం మార్లబీడు గ్రామానికి చెందిన బాయాదొడ్డి శివకుమార్ విద్యుత్ షాక్‌తో మృతి చెందడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శివకుమార్ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రభుత్వ అండ ఉంటుందన్నారు.