ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో రాష్ట్రంలో రెండో స్థానం జిల్లా

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో రాష్ట్రంలో రెండో స్థానం జిల్లా

NLG: నల్గొండ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఇళ్ల పురోగతిలో రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. ఇందుకు గాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి. గౌతమ్ జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజక్టు డైరెక్టర్ రాజకుమార్‌ను అభినందించడమే కాక, ల్యాప్ టాప్‌ను, ప్రశంసా పత్రాన్ని అందజేశారు.