అయిజ పోలీసు స్టేషన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అయిజ పోలీసు స్టేషన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

GDWL: గద్వాల్ జిల్లా, అయిజ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు పాల్గొన్నారు. ఆయన సబ్-ఇన్‌స్పెక్టర్‌కు, పోలీసు సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు, పలువురు పాల్గొన్నారు.