తెలంగాణ ఉద్యమకారుడి అకాల మరణం
SDPT: తొగుట మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన కొమ్ము కిషన్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం మళ్లీ గుండెపోటు రాగా సిద్ధిపేట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.