బంటుపల్లిలో రైతు మృతి విషాదం.!
KRNL: దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 26న సాయంత్రం బర్రె తగిలి కిందపడిన రైతు ఓబులేష్ గౌడ్ (50) తీవ్రంగా గాయపడ్డాడు. మొదట దేవనకొండ పీహెచ్సీకి, అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా.. ఫలితం లేక మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఘటనను ధృవీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.