VIDEO: "అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్" పై రైతులు హర్షం

కృష్ణా: బాపులపాడులో "అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్" నిధులు జమ కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానుమోలు గ్రామానికి చెందిన చెనుబోయిన వెంకటేశ్వరరావు 12 ఎకరాల వ్యవసాయం ఆయన సాగు చేస్తున్నట్లు చెప్పారు. కష్టకాలంలో ప్రభుత్వం తొలి విడతగా ఇస్తున్న 7000 రూపాయలు ఆదుకుంటున్నాయని పేర్కొన్నారు. సూపర్-6 పథకాలు అన్ని అమలు చేయాలని ఆయన కోరారు.