హత్యలు చేయిస్తారు.. పరామర్శ వాళ్లే చేస్తారు: మంత్రి
AP: ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ ఎన్ని నాటకాలైనా చేస్తుందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఎలా నటించారో అందరం చూశామన్నారు. హత్యలు వీళ్లే చేయిస్తారని.. పరామర్శ వీళ్లే చేస్తారని విమర్శించారు. పెద్ద దస్తగిరి ఎవరో ప్రజలకు తెలియాల్సి ఉందని.. ఎంపీ అవినాష్ రెడ్డి, రవీంత్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని వెల్లడించారు.