క్రిస్మస్‌ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు: అజారుద్దీన్‌ 

క్రిస్మస్‌ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు: అజారుద్దీన్‌ 

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి అజారుద్దీన్‌ ఆదేశించారు. 'సీఎం హాజరయ్యే క్రిస్మస్ విందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. జిల్లాల్లోనూ క్రిస్మస్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేపట్టాలి. రవాణా ఇబ్బందులు తలెత్తకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకోవాలి' అని సూచించారు.