గ్రామంలో ఓ వింత ఘటన

గ్రామంలో ఓ వింత ఘటన

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామంలో ఒక వింత చోటుచేసుకుంది. సాధారణంగా తాటి, ఈత చెట్ల నుంచి కల్లు రావడం చూస్తుంటాం, కానీ ఇక్కడ ఒక వేప చెట్టు నుంచి ధారాళంగా కల్లు కారుతోంది. రోజుకు దాదాపు మూడు లీటర్ల వరకు ఈ ద్రవం వస్తుండటం గమనార్హం. ఈ వేప కల్లు చేదుగా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని గ్రామస్థులు నమ్ముతున్నారు.