సర్వజన ఆస్పత్రిలో సదుపాయాలు మెరుగుపర్చాలి: సీపీఎం

సర్వజన ఆస్పత్రిలో సదుపాయాలు మెరుగుపర్చాలి: సీపీఎం

NDL: నంద్యాల జిల్లా సర్వజన ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని, ఆస్పత్రిలో సదుపాయాలు మెరుగుపర్చాలని CPM పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం సర్వజన ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఆస్పత్రిలో సిటీ స్కాన్ పరికరం పనిచేయడం లేదన్నారు. వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.