బురదమయంగా రహదారి.. ఇక్కట్లో ప్రజలు

బురదమయంగా రహదారి.. ఇక్కట్లో ప్రజలు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పంచాయతీ సచివాలయం-2లో రహదారి బురదమయంగా మారి గుంతలు ఏర్పడ్డాయి. ప్రతిరోజు పలు పనుల నిమిత్తం వృద్ధులు, మహిళలు సచివాలయానికి వెళ్తూ ఉంటారు. బురద ఎక్కువగా ఉండడంతో జారి కింద పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.