జాతర ముసుగులో రికార్డింగ్ డాన్స్
కాకినాడ: ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో శ్రీ నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా స్థానికంగా డీజే సౌండ్స్‌తో కూడిన డాన్స్ ప్రోగ్రామ్‌లు, సాంస్కృతిక నృత్యాలు ఏర్పాటు చేశారు. వీటిని చూడటానికి భక్తులు భారీగా బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.