VIDEO: పరిగి డీఎస్పీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
VKB: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పరిగిలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జాతి సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని డీఎస్పీ సూచించారు.