అక్రమంగా ఇసుక తరలిస్తూ రెండు ట్రాక్టర్లు పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తూ రెండు ట్రాక్టర్లు పట్టివేత

KNR: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డ ఘటన వీణవంక మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. చల్లూర్‌కు చెందిన కుంచం మహేష్, పోతిరెడ్డిపల్లికి చెందిన పల్లె అనిల్ ట్రాక్టర్లు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుకున్న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.