ఆ మూడు స్తంభాలపై దృష్టి పెట్టాం: శ్రీధర్ బాబు
TG: 'మేక్ ఇన్ సౌత్, స్కేల్ ఫర్ ది వరల్డ్' ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అర్బన్ ఇంజిన్, ఇండస్ట్రియల్ హార్ట్‌ల్యాండ్, రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే 3 స్తంభాలపై దృష్టి పెట్టామన్నారు.