గుంతలమయంగా అడ్డగూడూరు
BHNG: అడ్డగూడూరు మండల కేంద్రం నుంచి చౌల్లరామారం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగ తయారై ప్రయాణికులకు శాపంగా మారింది. బస్టాండ్ సమీపంలోని కోటమర్తి రోడ్డు వద్ద పెద్ద గుంత ఏర్పడి నీరు నిలువడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి గుంతలను పూడ్చి ప్రమాదాల భారీ నుంచి కాపాడాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.