సీఎం రాక సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
VKB: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటన సందర్భంగా కొడంగల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. ఆదివారం ఎన్కేపల్లి వద్ద అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రం ప్రారంభోత్సవ, సభ స్థల ఏర్పాట్లను కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ కలిసి పరిశీలించారు. రేపటికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.