బాలలకు నేత్ర పరీక్షలు

WGL: ఆరేళ్లలోపు చిన్నారుల్లో కంటి, మానసిక సమస్యలు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాల్లో కంటి పరీక్షలు చేపట్టారు. ఏప్రిల్ నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా 100% లక్ష్యాన్ని చేరింది. ములుగు జిల్లా 70.56%తో వెనుకబడింది. ప్రతి రోజు ఒక బృందం 100-150 మందికి పరీక్షలు చేస్తోంది. ఈ నెల 28నాటికి పరీక్షలు పూర్తవుతాయి.