ఉప్పల్ నుంచి చిలుకా నగర్ రోడ్డులో పనుల ఆలస్యం..!
MDCL: ఉప్పల్ నుంచి చిలుకా నగర్ వరకు రోడ్డుపై స్ట్రాం డ్రైన్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పనుల ఆలస్యంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారి రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు తవ్వి అలాగే వదిలేయడంతో దుమ్ము, గుంతలు ప్రమాదకరంగా మారాయి. స్థానికులు వెంటనే పనులు పూర్తి చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.