నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

PLD: చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నం సబ్ స్టేషన్ ఫీడర్ లైన్‌ల మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారి అశోక్ తెలిపారు. పురుషోత్తమపట్నం, కోటప్పకొండ రోడ్డు ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.