ఉద్రిక్తతలకు దారి తీసిన ఘటనపై కేసు నమోదు

ఉద్రిక్తతలకు దారి తీసిన ఘటనపై కేసు నమోదు

అన్నమయ్య: మదనపల్లి మేదరవీధిలోని అయ్యప్ప భక్తుడు వెంకటేష్‌పై దాడికి పాల్పడ్డ జియా ఉల్ హక్ పై కేసు నమోదు చేసినట్లు గురువారం డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అయ్యప్పమాలా ధారణలో ఉన్న వెంకటేష్ పై జియా ఉల్ హక్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గొడవలకు కారణం కావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అయ్యప్ప స్వాములు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.