కోకాపేట రూట్‌లో కారుకు ప్రమాదం

కోకాపేట రూట్‌లో కారుకు ప్రమాదం

HYD: కోకాపేటలో మంగళవారం ఉదయం ఓ కారుకు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట ప్రధాన రహదారిలో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనలో బేస్‌మెంట్ మొత్తం కూలిపోయింది. కారు ముందు భాగం దెబ్బతింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.