వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై
అన్నమయ్య: సుండుపల్లె మండలంలోని సబ్ స్టేషన్ సమీపంలో SI హుస్సేన్ ఆదివారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రికార్డులు లేకుండా ఉన్న వాహనాలకు చలానాలు విధించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.