డివైడర్‌పైకి దూసుకెళ్లిన బస్
SRD: పటాన్‌చెరు-ముత్తంగి జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వైపు వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అయితే, ఆ సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.