జాబ్ మేళాలో 128 మందికి ఉద్యోగాలు
ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గంలోని 167 మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరు కాగా 128 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి నెల్లూరు శ్రీ సిటీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.