అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
AP: అన్నదాత సుఖీభవ ద్వారా డబ్బులు జమకాని రైతులను గుర్తించి నగదు జమ అయ్యేలా చూడాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. అభయహస్తం చెల్లించిన మహిళలకు జగన్ మొండి చేయి చూపించారని పేర్కొన్నారు. రూ.2 వేల కోట్లకుపైగా అభయహస్తం నిధులను పక్కదారి పట్టించి మహిళలను మోసం చేశారని విమర్శించారు.