చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగతున్నారా?
చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదకరమని అమెరికాలో నిర్వహించిన తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. కూల్ డ్రింక్స్, చిప్స్, కుకీలు నేటి దైనందిన జీవితంలో భాగమయ్యాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. తాజా పండ్లు, కూరగాయల కంటే.. సిగరెట్, పొగాకు పరిశ్రమలతో ఎక్కువగా సారూప్యత కలిగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. వీటిని ఎక్కువగా తినే విధంగా రూపొందించారని పేర్కొన్నారు.