అనుమతుల్లేని టేకు కలప తరలింపు.. లారీ పట్టివేత

NLG: ప్రభుత్వ అనుమతులు లేకుండా టేకు కలపను తరలిస్తున్న లారీని నల్గొండ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. నల్గొండ మండలం వెలుగుపల్లిలో రైతుల నుంచి టేకును తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీ యజమానిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.