బొండపల్లిలో సచివాలయ భవనం ప్రారంభం
VZM : బొండపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. మాజీ జెడ్పీటీసీ బండారు బాలాజీ గజపతినగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గోపాలరాజు, మండల పార్టీ అధ్యక్షుడు రాపాక అచ్చంనాయుడు తదితరులు పాల్గొన్నారు.