కూటమి ప్రభుత్వం విఫలమైంది: మేయర్ భాగ్యలక్ష్మి

కృష్ణా: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విద్యుత్‌పై వైసీపీ ప్రజా పోరు బాట కార్యక్రమం నిర్వహించినట్లు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తెలిపారు. వైసీపీ నేతలతో కలిసి ఆమె విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.