ఇథియోపియాలో 'వందేమాతరం'.. వీడియో
ఇథియోపియన్ సింగర్లు భారత జాతీయ గేయం వందేమాతరం పాడుతున్న వీడియోను ప్రధాని మోదీ X వేదికగా పోస్ట్ చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తికావడం తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఇథియోపియాలో మోదీ పాల్గొన్న కార్యక్రమంలో అక్కడి సింగర్లు వందేమాతరం గేయాన్ని ఆలపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.