సంతకాలు సేకరించిన సాకే శైలజనాథ్
ATP: సింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్, బుక్క రాయసముద్రం మండలం పోడరాళ్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు.