ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

SKLM: లావేరు మండలం లక్ష్మీపురం గ్రామంలోని సచివాలయం వద్ద శుక్రవారం నెల్లిమర్ల మిమ్స్ జనరల్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కొల్లి ఈశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి ప్రారంభించారు. పరిసర గ్రామాల నుంచి 420 మందికి వైద్యులు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.