పట్టపగలే క్షుద్ర పూజల కలకలం

పట్టపగలే క్షుద్ర పూజల కలకలం

ADB: బీంపూర్ మండలంలో పట్టపగలే క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానికుల వివరణ ప్రకారం శుక్రవారం మండలంలోని పిప్పలకోటి గ్రామంలో గ్రామ పంచాయతీ సమీపంలోని వడ్ల దమ్మన్న ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయతో కూడిన వస్తువులను రోడ్డుపై ఉంచి వెళ్లారు. గమనించిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అపోహలు వద్దంటూ పోలీసులు అవగాహన కల్పించారు.