మంత్రి లోకేష్ పర్యటనలో ఎంపీ

NLR: రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసేందుకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర ఎంపీలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.