అవగాహనతో క్షయ నివారణ సాధ్యం: కలెక్టర్

అవగాహనతో క్షయ నివారణ సాధ్యం: కలెక్టర్

MLG: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ములుగు పట్టణంలో నిర్వహించిన ర్యాలీని మంగళవారం కలెక్టర్ దివాకర ప్రారంభించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు, అవగాహనతో క్షయ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, వ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.