'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం'

'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం'

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ప్రజల అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, మహిళలపై వేధింపులు వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.