గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

NLG: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద, గట్టుప్పల్ మండలం నామాపురం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కొరకు రూ.20 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నిధులు మంజూరైట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ మాజీ సర్పంచ్ కంచుకట్ల సంపత్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసినారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.