'పారిశుద్ధ పనులు పూర్తి చేయాలి'
WGL: వడ్డేపల్లి శ్యామల గార్డెన్స్ ప్రాంతంలోని వరద నీటి ప్రభావిత పరిస్థితులను శుక్రవారం GWMC కమిషనర్ చావత్ వాజ్ పాయ్ పరిశీలించారు. ప్రాంతంలో మురుగు నీరు మరియు చెత్తాచెదారం కారణంగా నీటి నిల్వ ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఆమెకు విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఆమె సమస్య పరిష్కారం కోసం పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.