VIDEO: ఉరుకుందలో ఈరన్నస్వామి పల్లకి మహోత్సవం

KRNL: కౌతాళం మండలం ఉరుకుందలో సోమవారం ఈరన్నస్వామి పల్లకి మహోత్సవం వైభవంగా జరిగింది. మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. సోమవారం శ్రావణమాస చివరి రోజున జరిగిన ఈ మహోత్సవంలో, కందుకూరు నుండి ఉరుకుందకు పల్లకిని అర్చకుల ఆధ్వర్యంలో నడిపారు. అనంతరం సాంప్రదాయ ఆచారాల్లో భాగంగా జరిగిన బరువు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.